వాంటెడ్ : సౌదీలో 20,000 మంది డ్రైవర్లు కావలెను!

- January 09, 2020 , by Maagulf
వాంటెడ్ : సౌదీలో 20,000 మంది డ్రైవర్లు కావలెను!

మక్కా: సౌదీలో ట్రాన్స్ పోర్ట్ రంగంలో దాదాపు 20,000 మంది ట్యాక్సీ డ్రైవర్ల కొరత ఉంది. క్యాబ్స్ సర్వీసెస్ ఉబెర్, కరీం, కింగ్ డమ్స్ తో పాటు ఇతర క్యాబ్స్ యాప్స్ లో డ్రైవర్స్ కి జాబ్స్ అవకాశాలు ఉన్నాయి. దీంతో డ్రైవర్ల భర్తీకి సౌదీ ట్రాన్స్ పోర్ట్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సౌదీలో డ్రైవింగ్ ఫీల్డ్ ఉపాధి అవకాశాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. 2016లో లక్ష మంది డ్రైవర్లు ఉంటే, ఈ మూడేళ్లలో డ్రైవర్ల సంఖ్య 6 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఇంకా ఉపాధి అవకాశాలు ఉన్నాయని మజెద్ అల్ జహ్రాని ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ తెలిపింది.  సౌదైజేషన్ నిబంధనలు అనుసరించి లైసెన్స్ ఉన్న ప్రవాసీయులు ఈ రంగంలో ఉపాధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే..నిబంధనలకు విరుద్ధంగా డ్రైవర్ ఫీల్డ్ లో వర్క్ చేసే వారికి 5000 సౌదీ రియాన్స్ ఫైన్ విధిస్తామని అధికారులు హెచ్చరించారు.

ముఖ్యంగా మహిళలకు డ్రైవింగ్ ఫీల్డ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వుమెన్ డ్రైవర్లపై బ్యాన్ ఎత్తివేసిన తర్వాత ఈ రంగంలో ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అరబ్ కుటుంబాలు ఎక్కువగా మహిళా డ్రైవర్లు ఉన్న ట్యాక్సీలు అంటేనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఫ్యామిలిలో లేడీస్ వెళ్లేందుకు లేడీ ట్యాక్సీ డ్రైవర్లు ఉన్న క్యాబ్స్ సర్విసెస్ ఎంతో సెఫ్టీగా భావిస్తున్నారు. బ్యాన్ ఎత్తివేసిన తర్వాత దాదాపు 2000 మంది మహిళలు డ్రైవింగ్ ఫీల్డుతో ఉపాధి పొందుతున్నారు. మంచి ఆదాయం, సేఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉండటంతో ఈ సంఖ్య మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

కరీమన్ ఖలీద్ అల్ గంబీ..ఆమె గతంలో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేది. అయితే..46 ఏళ్లకు రిటైర్ కావటంతో ఆదాయం కోసం ట్యాక్సీ డ్రైవర్ కొత్త జీవితం ప్రారంభించింది. ' సౌదీ కుటుంబాలు ఎక్కువగా లేడీ డ్రైవర్స్ ఉన్న క్యాబ్ సర్వీసెస్ కు ప్రధాన్యత ఇస్తున్నారు' అని అల్ గంబీ చెబుతున్నారు. అలాగే మక్కాకు చెందిన జమిల అల్ మహమౌదీ ఏడు నెలల క్రితం ఉబెర్ క్యాబ్స్ లో డ్రైవర్ గా జాయిన్ అయ్యింది. ఇక అక్కడి నుంచి ఆమె ఆదాయం, కుటుంబ ఉపాధి కోసం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. మక్కా సందర్శనకు వచ్చే భక్తులను గమ్యస్థానాలకు చేరుస్తూ సంతోషంగా గడుపుతున్నానని ఆమె చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com