హయ్యస్ట్‌ లెవల్‌కి సెక్యూరిటీ అలర్ట్‌ని పెంచిన కువైట్‌

- January 09, 2020 , by Maagulf
హయ్యస్ట్‌ లెవల్‌కి సెక్యూరిటీ అలర్ట్‌ని పెంచిన కువైట్‌

కువైట్‌ సిటీ: గత 48 గంటల్లో మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, సెక్యూరిటీ లెవల్‌ని హయ్యస్ట్‌ లెవల్‌కి పెంచింది. రీజియన్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే ఈ అలర్ట్‌ని చేపట్టారు. స్పెషల్‌ ఫోర్సెస్‌, స్టేట్‌ సెక్యూరిటీ, పబ్లిక్‌ సెక్యూరిటీ, ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ వంటి విభాగాల్ని ఈ అలర్ట్‌లో భాగం చేశారు. ఫీల్డ్‌ సెక్యూరిటీ స్టాఫ్‌ని కూడా తమ కార్యాలయాలకు రావాల్సిందిగా ఆదేశించారు ఉన్నతాధికారులు. మరింత జాగ్రత్తగా అన్ని అంశాల్నీ పరిశీలిస్తున్నామనీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com