అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి చికిత్స నిమిత్తం దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి
- January 10, 2020
యూ.ఏ.ఈ:39 ఏళ్ళ ఆసియా వ్యక్తి ఒకరు 7,500 దిర్హామ్లను కంపెనీ కారు నుంచి దొంగిలిస్తూ దొరికిపోయాడు. విచారణ సందర్భంగా నిందితుడు, ఆ డబ్బును తాను దొంగిలించింది అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి వైద్య చికిత్స చేసేందుకోసమేనని చెప్పాడు. నిందితుడికి న్యాయస్థానం 3 నెలల జైలు శిక్ష మాత్రమే విధించింది. దొంగిలించిన సొమ్ముల్లోంచి 1,000 దిర్హామ్లను తన తల్లికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఖర్చు చేశాడనీ, అంతే మొత్తంలో సొమ్ముని తన కుటుంబానికి పంపించాడనీ, మిగిలిన మొత్తాన్ని ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడని అధికారులు వివరించారు. స్పైసెస్ని ప్యాకేజ్ చేసే సంస్థకు చెందిన కారులో డబ్బు వుంచగా, డ్రైవర్ కారు దిగి వెళ్ళగానే నిందితుడు ఆ డబ్బుని కాజేశాడు. సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







