అనారోగ్యంతో కన్నుమూసిన ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్
- January 11, 2020
ఒమన్:కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అల్ సైద్ కన్నుమూశారు.శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు తెలిపింది. సుల్తాన్ మరణం పట్ల సంతాపం తెలుపుతూ దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు ఓ ప్రటకన విడుదల చేసింది. అరబ్, ఇస్లామిక్ దేశాల అభిమానం పొందిన సుల్తాన్ మృతి తీరని విషాదాన్ని మిగిల్చిందని విచారణ వ్యక్తం చేసింది. సుల్తాన్ మృతికి సంతాపంగా దివాన్ ఆఫ్ రాయల్ కోర్టు మూడు రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. అలాగే సంతాప సూచకంగా నలభై రోజుల పాటు జాతీయ జెండాను సగం వరకు కిందకు దించారు.
సుల్తాన్ కబూస్ 1940లో సలాహ్ లో జన్మించారు. ఐదు దశాబ్దాల పాటు మకుటం లేని మహారాజుగా ప్రజల మన్నలు అందుకున్నారు. గల్ఫ్ కంట్రీస్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
ఇదిలాఉంటే..సుల్తాన్ తన తరువాతి వారసుడి పేరును ఓ సీల్డ్ కవర్ దాచిపెట్టారు. తాను చనిపోయిన తర్వాత కవర్ ఓపెన్ చేయాలని కండీషన్ విధించారు. దీంతో రూలర్ సుల్తాన్ కబూస్ స్థానంలో అతని వారసుడిగా ఎవరు రాబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







