గ్లోబల్ సేల్‌ని ప్రకటించిన ఎతిహాద్
- January 11, 2020
ఎతిహాద్ ఎయిర్ వేస్, జనవరి గోల్డ్ సేల్‌ని ప్రకటించింది. ప్రముఖ హాలీడే డెస్టినేషన్స్‌ని ఈ గోల్డ్ సేల్‌లో తక్కువ ధరకే దక్కించుకునే అవకాశముంది. జనవరి 20 నుంచి నవంబర్ 25 వరకు ఈ సేల్‌ని వినియోగించుకోవచ్చు. అబుదాబీ నుంచి లండన్ హీత్రూకి కేవలం 2,343 దిర్హామ్‌లతో ఎకానమీ క్లాస్‌లోనూ, 11,949 దిర్హామ్‌లతో బిజినెస్ క్లాస్‌లోనూ ప్రయాణించడానికి వీలుంది. బిగ్ యాపిల్ న్యూయార్క్‌కి 4,843 దిర్హామ్‌లతో ప్రయాణించేందుఉ అవకాశం కల్పిస్తుండగా, రోమ్‌లోని ఎటెర్నల్ సిటీ సందర్శించేందుకు 2,683 దిర్హామ్‌లు చెల్లిస్తే పరిపోతుంది. షాంగై వెళ్ళాలనుకునేవారికి 2,038 దిర్హామ్‌లతో టిక్కెట్లు లభ్యమవుతాయి. జనవరి 23 వరకు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. ఈ మధ్యలో టిక్కెట్లు తీసుకున్నవారికి నవంబర్ 25 వరకు ప్రయాణించొచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







