దుబాయ్ లో వర్షాలు..నమోదైన షుమారు 1,900 ట్రాఫిక్ ప్రమాదాలు!

- January 12, 2020 , by Maagulf
దుబాయ్ లో వర్షాలు..నమోదైన షుమారు 1,900 ట్రాఫిక్ ప్రమాదాలు!

దుబాయ్‌లో గురువారం నుంచి భారీ వర్షాలు కురవడంతో 1,880 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయి. వీటిలో 55 ప్రమాదమైనవి కాగా మిగిలినవి చిన్న ఆక్సిడెంట్స్ అని అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు దుబాయ్ పోలీసుల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అత్యవసర నంబర్ 999 పై 51,749 కాల్స్, అత్యవసరం కాని నంబర్ 901 కు 5,562 కాల్స్ వచ్చాయి.

దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సైఫ్ మహీర్ అల్ మజ్రౌయి, వాహనదారులందరూ చెడు వాతావరణ పరిస్థితులలో జాగ్రత్తగా నడపాలని పిలుపునిచ్చారు, ట్రాఫిక్ దిశలు మరియు సంకేతాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను, అలాగే వాతావరణ వార్తలను విని జాగ్రత్తలు పాటించాలని కోరారు. వాహనాలను నెమ్మదిగా నడపడం మరియు రోడ్ల ప్రక్కన వాహనాలను ఆపడం కూడా ప్రమాదాల సంఖ్యను తగ్గించటానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com