దుబాయ్ లో వర్షాలు..నమోదైన షుమారు 1,900 ట్రాఫిక్ ప్రమాదాలు!
- January 12, 2020
దుబాయ్‌లో గురువారం నుంచి భారీ వర్షాలు కురవడంతో 1,880 ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయి. వీటిలో 55 ప్రమాదమైనవి కాగా మిగిలినవి చిన్న ఆక్సిడెంట్స్ అని అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుండి శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు దుబాయ్ పోలీసుల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అత్యవసర నంబర్ 999 పై 51,749 కాల్స్, అత్యవసరం కాని నంబర్ 901 కు 5,562 కాల్స్ వచ్చాయి.
దుబాయ్ పోలీస్ ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సైఫ్ మహీర్ అల్ మజ్రౌయి, వాహనదారులందరూ చెడు వాతావరణ పరిస్థితులలో జాగ్రత్తగా నడపాలని పిలుపునిచ్చారు, ట్రాఫిక్ దిశలు మరియు సంకేతాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను, అలాగే వాతావరణ వార్తలను విని జాగ్రత్తలు పాటించాలని కోరారు. వాహనాలను నెమ్మదిగా నడపడం మరియు రోడ్ల ప్రక్కన వాహనాలను ఆపడం కూడా ప్రమాదాల సంఖ్యను తగ్గించటానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!