బౌలింగ్‌ సెంటర్‌లో మహిళపై అసభ్యకర ప్రవర్తన

- January 13, 2020 , by Maagulf
బౌలింగ్‌ సెంటర్‌లో మహిళపై అసభ్యకర ప్రవర్తన

దుబాయ్‌ వలసదారుడొకరు, బౌలింగ్‌ సెంటర్‌లో మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ కేసులో నిందితుడు విచారణను ఎదుర్కొంటున్నాడు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, ఈ కేసుకు సంబంధించి సిసిటివి ఫుటేజ్‌ని సాక్ష్యంగా న్యాయస్థానం ముందుంచింది. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్‌ 22న జరిగింది. 32 ఏళ్ళ ఆస్ట్రేలియా మహిళ ఈ కేసులో బాధితురాలిగా వున్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిపై కేసులు నమోదు చేశారు. కేసు విచారణ జనవరి 28వ తేదీకి వాయిదా పడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com