మస్కట్:సుల్తాన్ కబూస్ స్ట్రీట్ క్లోజ్: సర్వీస్ రూట్లు చేంజ్ చేసిన మావసలాత్

మస్కట్:సుల్తాన్ కబూస్ స్ట్రీట్ క్లోజ్: సర్వీస్ రూట్లు చేంజ్ చేసిన మావసలాత్

సుల్తాన్ కబూస్ స్ట్రీట్ క్లోజ్ చేస్తున్నట్లు ఆర్వోపీ ప్రకటించటంతో మావసలాత్ తమ బస్ సర్వీస్ రూట్లను చేంజ్ చేసింది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్ మీదుగా వెళ్లే మబేలా- రువి సర్వీసును ఇతర మార్గాలకు మళ్లించారు. అలాగే రువి-ముత్ర రూట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేశారు. ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ తో 8,9,12 రూట్లో వెళ్లే సర్వీసులపై ప్రభావం చూపనుంది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్ లో జనవరి 14 వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ను అనుమతించట్లేదు. ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో రేపటి నుంచి సర్వీసులు యధావిధిగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Back to Top