అరామ్ కో షేర్లకు అదరిపోయే డిమాండ్ : మార్కెట్లోకి మరో 450 మిలియన్ల షేర్లు

అరామ్ కో షేర్లకు అదరిపోయే డిమాండ్ : మార్కెట్లోకి మరో 450 మిలియన్ల షేర్లు

సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కో షేర్లకు రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. ఐపీఓకి వచ్చిన రోజే ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సంచలనం సృష్టించిన అరామ్ కో షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఉండటంతో అదనంగా 450 మిలియన్ల షేర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత డిసెంబర్ 11న సౌదీ స్టాక్ మార్కెట్ తడవుల్ లిస్టింగ్ కి వచ్చిన అరామ్ కో తమ కంపెనీ షేర్లలో 1.5 శాతం వాటా షేర్లను ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్-IPO ద్వారా విక్రయించి 2,560 కోట్ల డాలర్లు (రూ.1.8 లక్షల కోట్లు) సమీకరించి ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓగా ఈ కంపెనీ అవతరించింది. కంపెనీ షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ ఉండటంతో గ్రీన్ షూ అప్షన్ ద్వారా మరో 450 మిలియన్ల అదనపు షేర్లను ఐఫీఓకి తీసుకొచ్చే వెసులుబాటు కలిగింది. అయితే..ఈ అదనపు షేర్లను బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టర్లకు అలాట్ చేసింది. దీంతో అదనపు షేర్లను విక్రయించినా మార్కెట్లోకి కొత్త షేర్లు రిలీజ్ చేయలేదని అరామ్ కో కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదిలాఉంటే అరామ్ కో షేర్ ప్రైజ్ ప్రస్తుతం 35 రియల్స్ కు చేరుకోవటంతో కంపెనీ విలువకు 1.87 ట్రిలియన్లు యాడ్ అయ్యాయి. దీంతోమార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా కూడా ప్రపంచ నెంబర్‌–1 కంపెనీగా సౌదీ ఆరామ్‌కో అవతరించింది.

Back to Top