భోగి పండ్ల విశిష్టత
- January 14, 2020
సంక్రాంతి యొక్క మూడు పర్వదినాలలో మొదటి రోజైన భోగి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది తెల్లవారకముందే పిల్లా పెద్దా అంతా కలిసి ఎంతో ఆనందంగా తమలో ఉన్న చెడు ఆలోచనలను దహించి వేస్తున్నట్లుగా ఇంటి ముందు వేసుకునే భోగిమంట. కానీ ఆ తర్వాత అందరికీ భోగి రోజున ముఖ్యంగా గుర్తువచ్చేది రేగిపండ్లు. ఈరోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లో చిన్నారులపై రేగి పండ్లు పోస్తారు. అలాగే వాటితోపాటు భోగి పండ్ల కోసం చెరుకుగడలు, బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు కూడా వాడతారు కొందరైతే సెనగలు కూడా కలుపుతారు.
ఇంతకీ ఈ రేగుపండ్లను పిల్లల మీద పోయడం వల్ల వచ్చే లాభం ఏమిటంటే.. ఇలా చేయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు వారికి లభిస్తాయని నమ్ముతారు . అలాగే భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని మరియు తల పైభాగంలో ఉన్న బ్రహ్మరథం దీనివల్ల ప్రేరేపితమై పిల్లల్లో మంచి జ్ఞానాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తారు . ఈరోజు పట్టణాల్లో ఈ సంప్రదాయం తగ్గిపోయింది కానీ ఇప్పటికీ పల్లెల్లో సాయంత్రం రోజున పెద్దలు పిల్లల తలపై రేగి పండ్లు పోస్తారు.
ఇంకా చెప్పాలంటే భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి వెళతాడు . ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు . సంక్రాంతి సూర్యుడి పండుగ .. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం , ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది . సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు . కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే .. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు .
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..