మోడీకి షాక్..CAA రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంలో పిటిషన్ వేసిన మొదటి రాష్ట్రంగా కేరళ
- January 14, 2020
పౌరసత్వ సవరణ చట్టం(caa)ని కేరళ ప్రభుత్వం తీవ్రంగ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా పిన్నరయి విజయన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఏఏ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు యొక్క నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది విజయన్ సర్కార్. పలు రాష్ట్రాలు సీఏఏపై వ్యతిరేకతను వ్యక్తం చేసినప్పటికీ ఈ విషయంలో సుప్రీంకోర్టుకెళ్లిన మొదటి రాష్ట్ర ప్రభుత్వం కేరళ కావడం విశేషం.
సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మాణం చేసిన మొదటి రాష్ట్రం కూడ కేరళ అన్న విషయం తెలిసిందే. సీఏఏ,పాస్ పోర్ట్ చట్టం,ఫారినర్స్ యాక్ట్ రూల్స్ ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,21,25 మరియు భారతదేశంలోని లౌకికవాదం యొక్క ప్రాథమిక నిర్మాణం ఉల్లంఘనగా సీఏఏని ప్రకటించాలని కేరళ సర్కర్ తన పిటిషన్ లో తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం బారత భూభాగంలో ఉన్న వ్యక్తులందరూ సమానంగా, భారతచట్టాల ప్రకారం కాపాడబడవలెను. అనగా ప్రభుత్వం వ్యక్తుల పట్ల కుల, మత, వర్గ, వర్ణ, లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ఏలాంటి వివక్ష చూపరాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21...చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు అని చెబుతోంది. అందరూ వ్యక్తులు సమానంగా మనస్సాక్షి స్వేచ్ఛకు అర్హులు అని ఆర్టికల్ 25 చెబుతోంది.
అంతకుముందు 11మంది బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు కేరళ సీఎం విజయన్ సీఏఏ విషయమై లేఖలు కూడా రాశారు. ప్రజాస్వామ్యం,సెక్యూలరిజాన్ని రక్షించడం కోసం కలిసికట్టుగా ఆ రాష్ట్రాల సీఎంలు కూడా తమ తమ అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మాణం చేయాలని ఆ లేఖల్లో విజయన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







