1.7 మిలియన్ దిర్హామ్‌ల మోసం కేసులో నిందితుడిపై విచారణ
- January 14, 2020
ఈజిప్టియన్ బిజినెస్‌మెన్ ఒకరు, దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని మోసం చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితుడు, కాంట్రాక్టింగ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ సంస్థతో ఒప్పదం కుదుర్చుకుని మాస్క్‌ని నిర్మించనున్నట్లు పేర్కొంటూ 1.7 మిలియన్ దిర్హామ్‌ల చెక్‌ని పొందాడు. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లనూ నిందితుడు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. కాగా, నిర్మాణ పనులు ప్రారంభించి, మధ్యలోనే పనులు ఆపేయడంతో, ఒప్పదం కుదుర్చుకున్న బాధిత సంస్థ, బ్యాంకును ఆశ్రయించగా, బ్యాంకు నుంచి చేసుకున్న అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ ఫోర్జరీవని తేలింది. దాంతో, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదవడం జరిగాయి. కేసు తదుపరి విచారణ జనవరి 23న జరగనుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







