తెలుగు తరంగిణి-రస్ అల్ ఖైమా వారి సంక్రాంతి సంబరాలు
- January 14, 2020
రస్ అల్ ఖైమా:తెలుగు వారి పెద్ద పండుగ మకర సంక్రాంతి ని తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో యు.ఎ.ఇ లోని రస్ అల్ ఖైమా నగరంలోని ఇండియన్ అసోసియేషన్ లో అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు.శాంతి, శ్రీవల్లి, సౌజన్య, ప్రశాంతి ప్రార్ధనాగీతంతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
ఉదయం భోగి మంటలు, తిరుప్పావై అనంతరం, సంప్రదాయం దుబాయ్ వారి సహకారం తో ధర్మరాజు మురారిదాస్ ప్రభు మరియు తిరుపతి వేదిక్ యూనివర్సిటీ నుండి వచ్చిన పీసపాటి శ్రీనివాస్ నిర్వహించిన శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా కొనసాగింది. కళ్యాణ మహోత్సవంలో శ్రీలలిత బృదం అన్నమయ్య కీర్తనలు, కూచిపూడి నృత్యాలు, చందా మేళం అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన శ్రీ గోదారంగనాధస్వాముల పల్లకి సేవలో భక్తులందరూ భక్తి పారవశ్యంతో పాల్గొన్నారు.
చిరంజీవులు మయూఖ్, మోహిత్, దక్షయ్ ల హరిదాసుల సందడి, రంగవల్లుల పోటి, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువు, చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. కమ్మని విందు భోజనాలతో, ఆట పాటలతో, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో, పల్లెలలోని సంక్రాంతిని సుదూరతీరాలలో ఉన్న తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి యు.ఎ.ఇ లోని వివిధ ఏమిరేట్స్ నుండి సుమారు 1200 మందికి పైగా భక్తులు హాజరు అయ్యారు.
తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్ ఆధ్వర్యంలో తరంగిణి సభ్యులు అందరు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చూసుకున్నారు. తెలుగు తరంగిణి సభ్యులు మైథిలిమోహన్ యాంకర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్ మీడియా సహకారం అందించింది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!