అస్కార్ రేసులో ఖతార్ మూవీస్
- January 14, 2020
దోహా ఫిల్మ్ ఇన్సిట్యూట్ సపోర్ట్ తో వచ్చిన రెండు ఖతార్ సినిమాలు ఈ ఏడాది అస్కార్ బరిలో నిలిచాయి. డాక్యుమెంటరీ విభాగంలో "ది కేవ్" అస్కార్ పోటీలో నిలవగా..లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ రేసులో "బ్రదర్ హుడ్" అస్కార్ కు నామినేట్ అయ్యింది. సిరియా సివిల్ వార్ నేపథ్యంతో ది కేవ్ డాక్యుమెంటరీని దర్శకుడు ఫెరాస్ ఫయ్యద్ తెరకెక్కించాడు. భయంకరమైన యుద్ధ వాతావరణంలో బాంబు దాడుల్లో గాయపడిన వారికి సిరియన్ డాక్టర్ అమని బల్లౌర్ అండర్ గ్రౌండ్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తుంటాడు. గుహా మాదిరిగా సీక్రెట్ ఆస్పత్రిలో వేలాది మంది ప్రాణాలను రక్షించేందుకు చేసిన ప్రయత్నాన్నే "ది కేవ్" గా డాక్యుమెంటరీ రూపొందించారు. డైరెక్టర్ ఫెరాస్ ఫయ్యద్ -లాస్ట్ మెన్ ఇన్ అలప్పో-మూవీకి గాను బెస్ట్ డైరెక్టర్ గా 2018లో ఆస్కార్ కు నామినేట్ అయ్యాడు. కానీ, ఆస్కార్ మాత్రం కొద్దిలో చేజారిపోయింది.
దోహా ఫిల్మ్ ఇన్సిట్యూట్ కో ఫైనాన్సియర్ గా నిర్మించిన "బ్రదర్ హుడ్" లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గా అస్కార్ కు నామినేట్ అయ్యింది. కుటుంబ బాధ్యతలు, నమ్మిన సిద్దాంతాల మధ్య చిక్కుకున్న ఓ ట్యూనిషియన్ ఫాదర్ గురించి పదునైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పటికే 48 దేశాల్లో 60 అవార్డులు దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ నిలిచింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల