ఇంట్లో చలిమంటలు వద్దు..ప్రజలకు అబుదాబి పోలీస్ హెచ్చరిక
- January 16, 2020
యూ.ఏ.ఈ:ఇళ్లలో ఎవరూ బొగ్గు, కట్టెలు కాల్చొద్దని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలితీవ్రత అమాంతంగా పెరిగింది. కొన్ని డివిజన్లలో టెంపరేచర్ మైనస్ లోకి వెళ్లిపోయాయి. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ పర్వత ప్రాంతంలో మంచు కూడా కురుస్తున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. చలితీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు ఇంట్లోనే చలిమంటలు వేసుకునే అవకాశాలు ఉండటంతో అబుదాబి పోలీసులు ముందస్తు హెచ్చరికలు సూచించారు. వెచ్చదనం కోసం ఎవరూ ఇంట్లో బొగ్గు, చెక్కలను కాల్చొద్దని వాటి నుంచి వెలువడే డేంజరస్ గ్యాస్ తో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. క్లోజ్డ్ ప్లేసెస్లో బొగ్గు, చెక్కలతో మంటపెడితే ప్రమాదకరమైన బెంజ్, కార్బన్ మోనాక్సైడ్, పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ వంటి విషవాయువులు వెలువడుతాయి. వీటి ద్వారా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బొగ్గు నుంచి వచ్చే పొగతో ఒక్కొసారి నిద్రలోనే ప్రాణాలు కొల్పోయే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!