అబుధాబి లో ఘోర రోడ్డు ప్రమాదం..6గురు మృతి,19 మందికి గాయాలు...మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
- January 16, 2020
అబుధాబి: అబుధాబిలో గురువారం ఉదయం 'అల్ రహా బీచ్ రోడ్' లో ట్రాఫిక్ ఆక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు. గాయపడిన 19 మందిలో 16 మంది నేపాలీ నివాసితులు ఉన్నారు అని యూఏఈ లోని నేపాల్ రాయబారి కృష్ణ ప్రసాద్ ధకల్ ధృవీకరించారు. తక్కినవారు ఎం దేశానికి చెందినవారు అనే సమాచారాం ఇంకా తెలియాల్సి ఉంది అని పోలీసు ప్రకటనలో తెలిపారు.
“బాధితులను తక్షణ చికిత్స కోసం అబుధాబిలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్వల్ప గాయాలకు చికిత్స పొందిన బాధితులలో కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. నేపాల్ బాధితులు ఎక్కడ పనిచేశారు, మరియు వారి వయస్సుపై సమాచారం ఇప్పటికీ అందుబాటులో లేదు” అని ధకల్ అన్నారు. ఈ ప్రమాదంలో కొంతమంది మరణించి కూడా ఉండవచ్చు కానీ దీనిని ఇంకా ధృవీకరించలేము అని ఆయన అన్నారు.
అబుధాబి పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ప్రకారం, ఒక తెల్లని కారు రోడ్డుపై ఆగిపోయింది. దాంతో రెండు లారీలు అకస్మాత్తుగా వేగాన్ని తగ్గించాయి. అప్పుడు వేగాన్ని తగ్గించలేని బస్సు రెండవ లారీలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడినవారు బస్సులోని వారే కావడం విషాదకరం.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







