మరోసారి దుమ్మురేపిన ఇస్రో..
- January 17, 2020
బెంగుళూరు:భారత్ గర్వించే ఇస్రో కీర్తి కిరీటంలో కలికితురాయి చేరింది. ఇస్రో మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని చాటింది. అత్యంత శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జి-శాట్ 30ని విజయవంతంగా ప్రయోగించింది.
ఏరియాన్ -5 వాహకనౌక 38నిమిషాల్లో జీ-శాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ట్విట్ చేశారు. ఇన్ శాట్ - 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్ -30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తూ ఏరియాన్ స్పేస్ సీఈఓ స్టెఫాన్ ఇస్రాల్ ట్వీట్ చేశారు.కొత్త ఏడాదికి బలమైన ప్రారంభం మొదలైంది. ఏరియాన్-5 రాకెట్ ద్వారా యుటెల్సాట్ కనెక్ట్, జీశాట్-30 జియోస్టేషనరీ ట్రాన్స్ ఫర్ ను కక్ష్యలో ప్రవేశపెట్టాం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఫ్రెంచ్ గయానా నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ఈ ప్రయోగంతో నాణ్యమైన టెలివిజన్ ప్రసారాలు, టెలికమ్యూనికేషన్ , బ్యాడ్ క్రాస్టింగ్ సేవలు మరింత మెరుగవుతాయి. దక్షిణ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్ భూభాగంలోని కౌరులోని ఏరియాన్ లాంఛ్ కాంప్లెక్స్ నుంచి తెల్లవారుజామున 2. 35 నిమిషాలకు ఈ ప్రయోగం చేపట్టారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం