ఎం.జి.రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల
- January 17, 2020తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం `తలైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల చెన్నైలో ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటుడు అరవింద స్వామి నటిస్తుండగా మరో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నారు.
ఎం.జి.రామచంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన జయలలిత లుక్, టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎంజీ రామచంద్రన్ లుక్‌ను యూనిట్ విడుదల చేసింది. అప్పటి ఎంజీఆర్ లుక్‌లో అరవింద స్వామి ఒదిగిపోయారు.డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలే్ ఆర్.సింగ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు