విశాఖలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 17, 2020
విశాఖపట్నం: 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరుగనున్నాయి. విశాఖ ఆర్కేబీచ్లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ వేడుకలకు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరుకానున్నారు. విశాఖలో రిపబ్లిక్‌డే వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో నేటి నుంచి 25 వరకు బీచ్ రోడ్డులో రిహార్సల్స్ జరుగనున్నాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, ఎపీఎస్పీ, ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ తో పాటు ఎన్సిసి, భారత్ స్క్వౌట్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, రెడ్ క్రాస్ బృందాలు పేరేడ్‌లో పాల్గొనున్నాయి. ఆర్కేబీచ్లో పరేడ్ శిక్షణలో భాగంగా ఉదయం 5:30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మరల సాయంత్రం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







