రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి షబానా అజ్మీ..
- January 18, 2020ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీకి రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రయాణిస్తూ ఉండగా, ఆమె కారు అదుపుతప్పి టిప్పర్‌కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె భర్త జావీద్ కూడా కారులోనే ఉన్నారు. డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే వారిని 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
'షబానా అజ్మీకి ముక్కుకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇప్పటివరకు బయటకు కనిపించే ఇతర గాయాలు లేవు. ఆమె ప్రస్తుతం షాక్ స్థితిలో ఉన్నారు. చికిత్స జరుగుతోంది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది' అని ఎంజిఎం హాస్పిటల్ డాక్లర్లు తెలిపారు. షబానా తన భర్త, ప్రముఖ రచయిత 75వ పుట్టినరోజును శుక్రవారం రాత్రి ముంబైలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్