ఆలివ్ ఆయిల్ ను మరిగించి ఇలా చేస్తే..

- January 19, 2020 , by Maagulf
ఆలివ్ ఆయిల్ ను మరిగించి ఇలా చేస్తే..

ఈ చలికాలంలో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్  శరీరానికి ఎన్నో పోషక విలువలను అందిస్తుంది. ఈ ఆయిల్ తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని ఇటీవలే ఓ పరిశోధనలో తెలియజేశారు. దీనిని తరచు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..

 
1. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. రోజువారి ఆహారంలో ఆలివ్ ఆయిల్ చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చును. చర్మరక్షణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
 
2. ఈ శీతాకాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అలాంటప్పుడు.. స్నానం చేసే ముందుగా శరీరానికి ఆలివ్ నూనె రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేస్తే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
3. జలుబు, దగ్గుతో బాధపడేవారు.. ఆలివ్ ఆయిల్ను వేడి చేసుకుని అందులో కొద్దిగా శొంఠి, పుదీనా ఆకులు చేసి మరికాసేపు మరిగించుకోవాలి. ఇలా తయారైన ఆయిల్ను గొంతులు రాసుకుంటే ఈ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. 
 
4. చాలామందికి చిన్న వయస్సులోనే చర్మం ముడతలుగా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే.. ఆలివ్ ఆయిల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే... చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
5. అధిక బరువు కారణంగా చాలామందికి శరీరంలో వ్యర్థాలు అధికంగా ఉంటాయి. వాటిని తొలగించాలంటే.. ఆలివ్ ఆయిల్ను వాడాలి. ఆలివ్ ఆయిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ వ్యర్థాలు తొలగించుటకు మంచిగా దోహదపడుతాయి. కాబట్టి రోజూ ఆలివ్ నూనెను వాడడం మరచిపోకండి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com