తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ప్రపంచ వేదిక పై విరసిల్లిన తెలంగాణ సాంస్కృతిక వైభవం

తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ప్రపంచ వేదిక పై విరసిల్లిన తెలంగాణ సాంస్కృతిక వైభవం

దోహ, ఖతర్ లో ఇండియన్ కల్చరల్ సెంటర్ వారు భారత రాయబార కార్యాలయం మరియు ఖతర్ మ్యూజియం వారి సహకారంతో నిర్వహించిన భారత-ఖతర్ సాంస్కృతిక వార్షికోత్సవం పాసేజ్ టు ఇండియా  అనే శీర్షిక తో  జనవరి 16 మరియు 17 తేదీల్లో   MIA పార్క్ లో జరగిన కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో చేసిన ప్రదర్శన ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.

తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ తెలంగాణ వేల ఏళ్ల  నుండి విశేష సాంస్కృతిక సంపద ఉందన్నారు. అలాంటి సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి  దశాబ్దానికి  క్రుషి చేస్తూ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా...తెలంగాణ జాగృతి ఖతర్ సభ్యులు, ఆడపడచులు హారిక , సుధ, లావణ్య, పద్మిని, రేణుక, మమత , శ్రావణి, ప్రసన్న, ప్రవీణ, రాజేశ్వరి మరియు జ్యోతి తెలంగాణ లో విశేష ప్రాచుర్యం పొందిన బంజారా మరియు ఇతర సాంస్కృతిక ప్రత్యేకతలను ఔన్నత్యాన్ని నృత్య రూపంలో ప్రదర్శించి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారని తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)

Back to Top