రోహిత్ ఆత్మహత్య కేసులో పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు

- January 18, 2016 , by Maagulf
రోహిత్ ఆత్మహత్య కేసులో పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు

హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐస్‌ఏ నాయకుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌, బీజేవైఎం నాయకుడు విష్ణుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ జూపల్లి రమేశ్‌ తెలిపారు. హెచ్‌సీయూలో పరిశోధక విద్యార్థి వేముల రోహిత్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ హెచ్‌సీయూలో ఆందోళనకు దిగారు. శవపరీక్ష నిమిత్తం రోహిత్‌ మృతదేహాన్ని తరలించడానికి యత్నించిన పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి పోలీసులు పలుమార్లు చేసిన ప్రయత్నాలను విద్యార్థులు భగ్నం చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోహిత్‌ తల్లిదండ్రులు యూనివర్శిటీకి చేరుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థులను చెదరగొట్టి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి రోహిత్‌ మృతదేహం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ రోహిత్‌ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా యూనివర్శిటీకి తరలించారు. రోహిత్‌ మృతదేహాన్ని చూసేందుకు ఉస్మానియాకు వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్‌ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com