రోహిత్ ఆత్మహత్య కేసులో పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
- January 18, 2016
హెచ్‌సీయూలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐస్‌ఏ నాయకుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్, బీజేవైఎం నాయకుడు విష్ణుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ జూపల్లి రమేశ్ తెలిపారు. హెచ్‌సీయూలో పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







