మూడో వన్డేలో ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం!

మూడో వన్డేలో ఆస్ట్రేలియా పై భారత్  ఘన విజయం.. సిరీస్ కైవసం!

బెంగళూరు:భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఫామ్‌లో ఉన్న ధవన్ ఆటకు దూరమవడంతో ఆందోళన చెందిన అభిమానులను సెంచరీ వీరుడు రోహిత్ 119 పరుగులతో కనువిందు చేశాడు. అతనితోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ 89 పరుగులతో మ్యాచ్‌లో భారత్ విజయానికి బాటలు వేశారు. వీరిద్దరూ కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

Back to Top