విజయ్, పూరి ల `ఫైటర్` షూటింగ్ షురూ
- January 20, 2020క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఫైటర్`. సోమవారం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఛార్మి క్లాప్ కొట్టారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్, పూరి టూరింగ్ టాకీస్ పతాకాలపై పూరి, ఛార్మి, కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. హెయిర్ స్టైల్ మార్చుకోవడమే కాదు.. పూరి హీరో స్టైల్లో ఫిజిక్ పరంగానూ విజయ్ దేవరకొండ సరికొత్తగా కనపడబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ తర్వాత పూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిదే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు