ESICలో ఉద్యోగావకాశాలు

- January 21, 2020 , by Maagulf
ESICలో ఉద్యోగావకాశాలు

హైదరాబాద్: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌, సూపర్ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్‌, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో ఉన్న ఐఎస్ఐ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈఎన్‌టీ, రేడియాలజీ, నియోనటాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్‌, ఆప్తాల్మజీ, యూరాలజీ, ప్లాస్టిస్ సర్జరీ, నెఫ్రాలజీ, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ఆంకాలజీ, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ,హెమటాలజీ విభాగాలలో సీనియర్ రెసిడెంట్స్‌ పోస్టులున్నాయి. పోస్టులను బట్టి వాక్ ఇన్ ఇంటర్వ్యూలను ఫిబ్రవరి 1 నుంచి మార్చి 3 తేదీలవరకు నిర్వహిస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఈఎస్ఐ ఉద్యోగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనక్కర్లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22-01-2020
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30-01-2020.
అర్హత: పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/ పీజీ డిప్లొమా, పని చేసిన అనుభవం ఉండాలి.

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

ఈఎస్ఐ వెబ్ సైట్

వయోపరిమితి: టీచింగ్ పోస్టులకు 69 ఏళ్లు మించరాదు. సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్, స్పెషలిస్ట్ పోస్టులకు 66 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ పోస్టులకు 37 ఏళ్లు, జూనియర్ రెసిడెంట్ పోస్టు అభ్యర్థులకు 30 ఏళ్లకు మించరాదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com