దుబాయ్:భారత స్టోర్ కీపర్ కి పట్టిన మహత్బాగ్యం

- January 21, 2020 , by Maagulf
దుబాయ్:భారత స్టోర్ కీపర్ కి పట్టిన మహత్బాగ్యం

దుబాయ్:దుబాయ్ లో ఓ భారతీయుడు తాను కన్న కలను పదేళ్లకు సాకారం చేసుకున్నాడు. వివరంగా చెప్పాలంటే..దుబాయ్‌లో శ్రీజిత్ అనే భారతీయుడు స్టోర్‌ కీపర్‌గా పనిచేస్తున్నాడు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించే ప్రతి రాఫిల్(లాటరీ)లో శ్రీజిత్ పాల్గొంటూ వస్తున్నాడు. ఇలా పదేళ్ల నుంచి ప్రతి రాఫిల్‌లో టికెట్ కొంటూ వస్తున్న శ్రీజిత్‌కు.. ఇంతకాలానికి అదృష్టం వరించింది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 25వ ఎడిషన్ సందర్భంగా నిర్వహించిన ఇన్ఫినిటీ మెగా రాఫిల్‌లో శ్రీజిత్ 2 లక్షల దిర్హామ్‌ల క్యాష్ ప్రైజ్, ఇన్ఫినిటి క్యూఎక్స్500 కార్‌ను గెలుపొందాడు.

తాను లాటరీలో గెలుపొందడం ఇప్పటికీ కలలానే ఉందంటూ శ్రీజిత్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఏదో ఒక రోజు అదృష్టం తనను వరిస్తుందనే నమ్మకంతోనే.. తాను పదేళ్ల నుంచి ప్రతి రాఫిల్‌లో పాల్గొంటూ వస్తున్నట్టు శ్రీజిత్ చెబుతున్నాడు. ఈ గెలుపు ద్వారా సహనం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చనే పాఠాన్ని నేర్చుకున్నానని శ్రీజిత్ తెలిపాడు. గెలిచిన డబ్బుతో తన ముగ్గురు పిల్లలకు బంగారు భవిష్యత్తును అందిస్తానని శ్రీజిత్ చెప్పాడు.

కాగా.. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించే ఇన్ఫినిటి రాఫిల్‌లో నిత్యం ఒక విన్నర్‌కు ఇన్ఫినిటి క్యూఎక్స్50 కార్‌, రెండు లక్షల దిర్హామ్‌ల క్యాష్ ప్రైజ్‌ను అందజేస్తారు. అదే విధంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ చివరి రోజున ఒక లక్కీ షాపర్‌ 10 లక్షల దిర్హామ్‌ల క్యాష్ ప్రైజ్‌ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ రాఫిల్‌లో పాల్గొనేవారు ముందుగా 200 దిర్హామ్‌లు పెట్టి రాఫిల్ టికెట్ కొనాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com