దుబాయ్:భారత స్టోర్ కీపర్ కి పట్టిన మహత్బాగ్యం
- January 21, 2020_1579601503.jpg)
దుబాయ్:దుబాయ్ లో ఓ భారతీయుడు తాను కన్న కలను పదేళ్లకు సాకారం చేసుకున్నాడు. వివరంగా చెప్పాలంటే..దుబాయ్‌లో శ్రీజిత్ అనే భారతీయుడు స్టోర్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించే ప్రతి రాఫిల్(లాటరీ)లో శ్రీజిత్ పాల్గొంటూ వస్తున్నాడు. ఇలా పదేళ్ల నుంచి ప్రతి రాఫిల్‌లో టికెట్ కొంటూ వస్తున్న శ్రీజిత్‌కు.. ఇంతకాలానికి అదృష్టం వరించింది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 25వ ఎడిషన్ సందర్భంగా నిర్వహించిన ఇన్ఫినిటీ మెగా రాఫిల్‌లో శ్రీజిత్ 2 లక్షల దిర్హామ్‌ల క్యాష్ ప్రైజ్, ఇన్ఫినిటి క్యూఎక్స్500 కార్‌ను గెలుపొందాడు.
తాను లాటరీలో గెలుపొందడం ఇప్పటికీ కలలానే ఉందంటూ శ్రీజిత్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఏదో ఒక రోజు అదృష్టం తనను వరిస్తుందనే నమ్మకంతోనే.. తాను పదేళ్ల నుంచి ప్రతి రాఫిల్‌లో పాల్గొంటూ వస్తున్నట్టు శ్రీజిత్ చెబుతున్నాడు. ఈ గెలుపు ద్వారా సహనం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చనే పాఠాన్ని నేర్చుకున్నానని శ్రీజిత్ తెలిపాడు. గెలిచిన డబ్బుతో తన ముగ్గురు పిల్లలకు బంగారు భవిష్యత్తును అందిస్తానని శ్రీజిత్ చెప్పాడు.
కాగా.. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించే ఇన్ఫినిటి రాఫిల్‌లో నిత్యం ఒక విన్నర్‌కు ఇన్ఫినిటి క్యూఎక్స్50 కార్, రెండు లక్షల దిర్హామ్‌ల క్యాష్ ప్రైజ్‌ను అందజేస్తారు. అదే విధంగా దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ చివరి రోజున ఒక లక్కీ షాపర్ 10 లక్షల దిర్హామ్‌ల క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ రాఫిల్‌లో పాల్గొనేవారు ముందుగా 200 దిర్హామ్‌లు పెట్టి రాఫిల్ టికెట్ కొనాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!