డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజిమెంట్ కోటా
- January 22, 2020
హైదరాబాద్:డిగ్రీ విద్యలో మార్పులు తీసుకొస్తూ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంజినీరింగ్లో మాదిరిగానే ఇకపై డిగ్రీలో కూడా మేనేజిమెంట్ కోటా అమలు కానుంది. ఈ జూన్ నుంచి కొత్త విద్యా సంవత్సరం(2020-21) మొదలు కానుండగా.. రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజిమెంట్ కోటాను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
గతేడాదే ఈ ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు మండలి ముందు ఉంచిన సంగతి తెలిసిందే. ఇక కొత్త విద్యా సంవత్సరం నుంచి మేనేజిమెంట్ కోటా అమలు కానుండటంతో 30 శాతం సీట్లు యాజమాన్యాలే భర్తీ చేసుకునేలా అనుమతులు లభించనున్నాయి. అంతేకాకుండా ఈ కోటా ద్వారా చేరే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు.
ఇకపోతే 100 శాతం విద్యార్థులు చేరిన కోర్సులకు అదనపు సెక్షన్లు, కొత్త కోర్సులకు కూడా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. అటు అటానమస్ డిగ్రీ కాలేజీల్లో భాషా సబ్జెక్టులను ఇకపై మూడేళ్లు కాకుండా రెండేళ్లు చదివేలా చర్యలు చేపడతామని మండలి హామీ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు