మొబైల్‌ రీచార్జ్‌ అడిగినందుకు భార్యను కొట్టి చంపిన భర్త

- January 22, 2020 , by Maagulf
మొబైల్‌ రీచార్జ్‌ అడిగినందుకు భార్యను కొట్టి చంపిన భర్త

అజ్మాన్: మొబైల్‌ రీచార్జ్‌ కార్డ్‌ అడిగిన భార్యను కొట్టి చంపాడో భర్త. ఇద్దరి మధ్యా మొబైల్‌ రీచార్జ్‌ విషయమై గొడవ జరగ్గా, సహనం కోల్పోయిన భర్త, తన చేతిలో వున్న కర్రతో భార్య తల మీద గట్టిగా కొట్టడంతో 49 ఏళ్ళ భార్య మృతి చెందింది. కాగా, 58 ఏళ్ళ వయసున్న భర్త, తాను ప్రార్థన చేస్తున్న సమయంలో తన భార్య తన మీద రీచార్జ్‌ విషయమై ఒత్తిడి తెచ్చిందనీ, దాంతో తాను ఆమెను కోపంతో కొట్టిన మాట వాస్తవమేగానీ, చంపాలనుకోలేదని విచారణలో చెప్పాడు. కర్రతో కొట్టిన తర్వాత ఆమె అక్కడే వుండిపోయిందనీ, తాను బయటకు వెళ్ళి రీచార్జ్‌ కార్డ్‌ తీసుకొచ్చి ఆమెకు ఇచ్చేందుకు ప్రయత్నించాననీ, అయితే ఆమె మళ్ళీ లేవలేదని చెప్పాడు నిందితుడు. తలలో అంతర్గతంగా రక్తస్రావం జరగడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు మెడికల్‌ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com