దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇండియన్ కి జాక్‌పాట్ !

- January 22, 2020 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇండియన్ కి జాక్‌పాట్ !

దుబాయ్:దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇండియన్ కి జాక్‌పాట్ కొట్టాడు. అబుధాబిలో ఉండే ఏకే మొహమ్మద్(51) అనే వ్యక్తికి మంగళవారం తీసిన మిలీనియం మిలియనీర్‌ లాటరీ డ్రాలో ఏకంగా రూ. 7 కోట్లకు పైగా గెలుచుకున్నాడు. 20 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్న ఏకే మొహమ్మద్  ఓ నిర్మాణ సంస్థలో టెక్నికల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ప్రతి ఏడాది లాటరీ టికెట్లు కొనుగోలు చేసేవాడు. ఈసారి కూడా మిలీనియం మిలియనీర్‌లో 321 సిరీస్‌లో నెం.3644తో లాటరీ టికెట్ కొన్నాడు. ఈ టికెటే ఏకే మొహమ్మద్కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అతను కొనుగోలు చేసిన ఈ టికెట్‌కు ఏకంగా మిలియన్ డాలర్లు తగిలాయి. దీంతో ఏకే మొహమ్మద్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఇదే డ్రాలో మరో భారత వ్యక్తి అనీష్ చాకో కొనుగోలు చేసిన సిరీస్ 395, టికెట్ నెం.0327కు కూడా లాటరీ తగిలింది. దీంతో అనీష్ మోటో గుజ్జీ మిలానో మోటర్‌బైక్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఏకే మొహమ్మద్ మాట్లాడుతూ నెలకు ఇద్దరిని కోటీశ్వర్లుగా చేస్తున్న దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com