జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాక్...
- January 22, 2020
అమెరికా:ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచపు అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌కు గురైన అంశం వెలుగు చూసింది. 2018లో తన ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ నుంచి జెఫ్ బెజోస్‌కు వెళ్లిన ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇది హ్యాకింగ్‌కు గురైనట్లు గుర్తించడం జరిగింది.
సౌదీ యువరాజు మొహ్మద్ బిన్ సల్మాన్ వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ నుంచి వైరస్‌తో కూడిన వీడియో ఫైల్‌ను పంపడం ద్వారా 2018 నుంచి అమెజాన్ చీఫ్ ఫోన్‌కు సంబంధించిన డేటా చోరీకి గురైందని డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ పేర్కొందని గార్డియన్ కథనం వెల్లడించింది. జెఫ్ బెజోస్ ఫోన్ నుంచి ఎలాంటి డేటా చోరీకి గురైందనేది తెలియదని వ్యాఖ్యానించింది. జెఫ్ బెజోస్ ఆయన భార్య మెకంజీలు పాతికేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతూ విడాకుల నిర్ణయాన్ని ప్రకటించిన ఏడాది తర్వాత ఈ కథనం వెల్లడవడం గమనార్హం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!