బహ్రెయిన్‌లో బిగ్గెస్ట్ షాపింగ్ ఫెస్టివల్
- January 22, 2020
బహ్రెయిన్:రేపటి నుంచి జనవరి 31 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ హాల్స్ అన్నీ సందర్శకులతో కళకళ్లాడనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రోడక్ట్స్ ఈ ఆటమ్న్ ఫెయిర్‌లో కొలువుదీరతాయి. వరుసగా ఇది 31వ ఏడాది ఈ ఫెస్టివల్‌కి సంబంధించి. బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం ఈ తొమ్మిది రోజులు రిటైల్ ప్యారడైజ్‌ని నిర్వహిస్తోంది. 16 దేశాల నుంచి 650 స్టాల్స్ ఈ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. పెద్దయెత్తున డిస్కౌంట్లతో వినియోగదారులకు సరికొత్త అనుభూతి కలగనుంది. ఫుడ్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్, టెక్నాలజీ, టాయ్స్, టెక్స్‌టైల్స్ ఇంకా చాలా చాలా వస్తువులు ఇక్కడ కొలువు దీరుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఆ రోజుల్లో వేళల మార్పు కూడా వుంటుంది. జనవరి 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం మహిళల్నే అనుమతిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!