కొత్త ఫిషింగ్ ఫీజ్‌ని ప్రకటించిన షార్జా
- January 22, 2020
షార్జాలో రిక్రియేషనల్ ఫిషింగ్‌కి సంబంధించి కీలకమైన నిర్ణయాలు వెలువడ్డాయి. క్రౌన్ ప్రిన్స్, షార్జా డిప్యూటీ లీడర్, షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి నేతృత్వంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫిషింగ్‌కి సంబంధించి కొన్ని నిబంధనల్ని విధించారు. ఫిషింగ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు వారం రోజులకుగాను 30 దిర్హామ్‌లు ఫీజు చెల్లించాలి. నెల రోజులకు 100 దిర్హామ్‌లు, సంవత్సరానికి 250 దిర్హామ్‌లు చెల్లించాల్సి వుంటుంది. అదే ఫ్యామిలీ పర్మిట్ విషయానికొస్తే, వారానికి 50 దిర్హామ్‌లు, నెలకి 150 దిర్హామ్‌లు, ఏడాదికి 400 దిర్హామ్‌లు చెల్లించాలి. దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఎమిరేటీ పౌరుడు లేదా షార్జా ఇచ్చే రెసిడెన్స్ పర్మిట్‌ని కలిగి వుండాలి. బీచ్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తను వదిలి వెళ్ళరాదు. కమిషన్స్ ఇన్‌స్పెక్టర్‌కి సహకరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!