బర్ దుబాయ్ విల్లాలో ఇద్దరు హౌస్ మెయిడ్స్ మృతి
- January 22, 2020
దుబాయ్: ఇద్దరు ఆసియా జాతీయులైన మెయిడ్స్, బర్ దుబాయ్‌లోని ఓ విల్లాలో మృతి చెందారు. స్పాన్సర్‌కి చెందిన విల్లాలో చార్కోల్ పొగ కారణంగా వీరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రూమ్‌ని వెచ్చగా వుంచుకునేందుకోసం చార్కోల్ని మండించారనీ, రాత్రి వారు నిద్రపోగా.. ఆ రూమ్ అంతా పొగ వ్యాపించి, ఊపిరి ఆడక అందులోనే వారు మృతి చెందినట్లు వివరించారు పోలీసులు. విల్లా ఓనర్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ కారణంగానే వీరి మృతి సంభవించిందని దుబాయ్ పోలీస్‌కి చెందిన సంబంధిత డిపార్ట్మెంట్ హెడ్ చెప్పారు. ఈ తరహా ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, వెచ్చదనం కోసం ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!