బర్ దుబాయ్‌ విల్లాలో ఇద్దరు హౌస్‌ మెయిడ్స్‌ మృతి

- January 22, 2020 , by Maagulf
బర్ దుబాయ్‌ విల్లాలో ఇద్దరు హౌస్‌ మెయిడ్స్‌ మృతి

దుబాయ్‌: ఇద్దరు ఆసియా జాతీయులైన మెయిడ్స్‌, బర్ దుబాయ్‌లోని ఓ విల్లాలో మృతి చెందారు. స్పాన్సర్‌కి చెందిన విల్లాలో చార్‌కోల్‌ పొగ కారణంగా వీరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రూమ్‌ని వెచ్చగా వుంచుకునేందుకోసం చార్‌కోల్‌ని మండించారనీ, రాత్రి వారు నిద్రపోగా.. ఆ రూమ్‌ అంతా పొగ వ్యాపించి, ఊపిరి ఆడక అందులోనే వారు మృతి చెందినట్లు వివరించారు పోలీసులు. విల్లా ఓనర్‌ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కార్బన్‌ మోనాక్సైడ్‌ కారణంగానే వీరి మృతి సంభవించిందని దుబాయ్‌ పోలీస్‌కి చెందిన సంబంధిత డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ చెప్పారు. ఈ తరహా ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలనీ, వెచ్చదనం కోసం ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com