తెలంగాణలో భారీ పెట్టుబడులు రెడీ అయిన పిరమాల్ గ్రూప్
- January 22, 2020
దావోస్:తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీ పిరమాల్ గ్రూప్ సిద్ధమైంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలుస్తోంది. పిరమాల్ గ్రూప్‌కు ప్రస్తుతం తెలంగాణలో 1400 మంది ఉద్యోగులున్నారు. ఈ పెట్టుబడులతో అదనంగా మరో 600 మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం దక్కుతుంది.
ఇదిలావుంటే, ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల్లో వున్న కంపెని ప్లాంట్లను కూడా హైదరాబాద్‌కు తరలించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. ఈ పర్యటన తర్వాత పెట్టుబడులు పట్టాలెక్కే అవకాశం వుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!