ఎగ్జాగరేటెడ్‌ ప్రిడిక్షన్స్‌పై అల్‌ సాదౌన్‌ అసహనం

- January 23, 2020 , by Maagulf
ఎగ్జాగరేటెడ్‌ ప్రిడిక్షన్స్‌పై అల్‌ సాదౌన్‌ అసహనం

కువైట్‌:వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయనీ, చాలా చోట్ల స్నో ఫాల్‌ వుండొచ్చనీ ముందస్తు అంచనాలు వస్తుండడంపై ఆస్ట్రనామర్‌ అదెల్‌ అల్‌ సాదౌన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతల తగ్గవచ్చుగానీ, 5 డిగ్రీల కంటే తగ్గిపోవడం అసాధ్యమని చెప్పారు. మంచు కురిసేంత, జీరో స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమే లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. గతంలోనూ ఈ తరహా ప్రిడిక్షన్స్‌ వచ్చాయనీ, ఇప్పుడూ వస్తున్నాయని ఆయన అన్నారు. వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా వున్నాయనీ, మంచు కురిసే అవకాశం దాదాపుగా లేదని అయన తేల్చి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com