గణతంత్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు...

- January 23, 2020 , by Maagulf
గణతంత్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు...

విజ‌య‌వాడ‌: ఈ నెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టరు ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. గురువారం స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రిపబ్లిక్ డే ఉత్సవాల కోసం నగర పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజాన్ సమావేశంలో జిల్లా కలెక్టరు పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చెయ్యాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఆహ్వానితులు అందరూ ఉదయం 8-30 గంటలకు ముందుగానే స్టేడియంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డ్యూటీపార్లు, ఐడెంటిఫికేషన్ కార్డులతో హాజరుకావాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ పోలీస్లకు, అధికారులకు సహకరించాలన్నారు. గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారన్నారు. కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిలతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతస్థాయి అధికారులు, ఆర్మీ, యన్ సిసి కంటే జెంట్స్, అధికారులు, తదితరులు హాజరవుతారన్నారు. స్వాతంత్ర్య సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతులు కూడా ఈకార్యక్రమానికి హాజరు అవుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించిన వివిధ శాఖల ద్వారా రూపొందించబడిన 14 శకటాలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అంబులెన్లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, గ్యాలరీలలో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసామన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాలుపంచుకుంటున్న ప్రముఖులు, తదితరులకు సంబంధించి ప్రవేశం, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ఫుడ్ కోర్టు వైపు ఉన్న 3వ గేట్ నుండి వి.వి.ఐ.పి.లు, ఏఏ పాస్ కలవారు, గేట్ 4 వైపునుండి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మీడియా ప్రతినిధులు, ఏ1 పాస్ హోల్డర్స్, గేట్ 2 నుండి ఆలిండియా సర్వీస్ అధికారులు, బి1 పాస్ హోల్డర్స్, స్వాతంత్య సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, 5వ గేట్ నుండి పాఠశాల విద్యార్థినీ, విద్యార్ధులు, 6వ గేటు నుండి సాధారణ ప్రజలను లోపలికి అనుమతిస్తామన్నారు. పిల్లలను తీసుకువచ్చే బస్టు బిషప్ అజరయ్య గ్రౌండ్, సిద్ధార్థ స్కూల్ లో, గవర్నమెంట్ క్వార్టర్స్, పి.డబ్ల్యు.డి. గ్రౌండులలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసామని తెలిపారు. ఆలిండియా సర్వీస్ అధికారులకు పోలీస్ పెరేడ్ గ్రౌండులో పార్కింగ్ ఏర్పాటు చేసారని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సబ్ కలెక్టరు థ్యానచంద్ర, జే.సి.-2 మోహన్ కుమార్, డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉదయరాణి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్లు, డైరెక్టర్ ప్రొటోకాల్ మురళి, తదితరులు పాల్గొన్నారు.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com