టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు
- January 23, 2020
అమరావతి: రాజధాని ఉద్యమంలో టీడీపీ నేతల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఇవాళ ఉదయం పార్టీ నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో వైసీపీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.
మంత్రులు చేసిందేమిటి? : ‘రింగుదాటి వస్తే బయటపడేయండని మార్షల్స్‌ను జగన్ ఆదేశించారు.. మండలిలో వైసీపీ మంత్రులు చేసిందేమిటి?. పోడియం బల్లలు ఎక్కి, పేపర్లు చించి సభాపతిపై విసిరిన మంత్రులను వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చేయాలి..?. మండలిలో 25మంది మంత్రులు తిష్టవేసి వీరంగం చేశారు. ఎంపీ గల్లా జయదేవ్‌ను శారీరకంగా, మానసికంగా హింసించారు. ఇక అమరావతి పరిరక్షణ ప్రజల చేతుల్లోనే ఉంది. జేఏసీ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి’ అని టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!