ఎల్‌ఐసీ పాలసీ ప్రియులకు చేదువార్త
- January 24, 2020
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) త్వరలో 23 పాలసీలను నిలిపేస్తోంది. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పాలసీలనే నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అందులో ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందిన జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీబ్యాక్, అన్మోల్ జీవన్.. ఇలా మొత్తం 23 పాలసీలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి ఈ పాలసీలన్నీ గతేడాది నవంబర్ 30వ తేదీనే నిలిచిపోవాల్సింది. అయితే ఐఆర్‌డీఏఐ గడువు పెంచడంతో.. ఈ జనవరి 31 వరకు ఈ 23 పాలసీలను కొనసాగిస్తోంది. అయితే వీటి స్థానంలో మళ్లీ కొత్త పాలసీలను తీసుకురానుంది. వాటిలో ఇప్పుడు ఉన్న ప్రీమీయిం రేట్ల కంటే ఎక్కువ కట్టాల్సి వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. బోనస్ కూడా తగ్గుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త పాలసీ చేయాలనుకునే వారు.. ఈ వారం రోజుల్లో చేసుకుంటే.. ప్రస్తుతం ఉన్న లాభాలను పొందే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు