కరోనా వైరస్ అలర్ట్ : యూఏఈ ఎయిర్ పోర్ట్స్ లో థర్మల్ స్క్రీనింగ్

కరోనా వైరస్ అలర్ట్ : యూఏఈ ఎయిర్ పోర్ట్స్ లో థర్మల్ స్క్రీనింగ్

యూఏఈ:చైనాను వణికిస్తున్న మిస్టరీ వైరస్ కరోనా ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా నుంచి హాంకాంగ్, సింగపూర్, థాయ్ లాండ్, జపాన్, అమెరికా, దక్షిణ కొరియాలకు వైరస్ సోకింది. దీంతో గల్ఫ్ కంట్రీస్ అలర్ట్ అయ్యాయి. కరోనా వైరస్ తమ దేశంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాయి. యూఏఈ, కువైట్, అబుదాబి, సౌదీ అరేబియా ఎయిర్ పోర్టుల్లో థర్మల్ స్రీనింగ్ ప్రారంభించారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తున్నారు. అలాగే చైనాలో ఉన్న తమ దేశ పౌరులను ఆయా దేశాలు అప్రమత్తం చేస్తున్నాయి. చైనాలో ప్రయాణం రద్దు చేసుకోవటం మంచిదని సూచిస్తున్నాయి. ఒకవేళ ఇప్పటికే చైనాలో ఉంటే రద్దీ ప్రంతాల్లో ఉండొద్దని, మాంసం ఉత్పత్తులకు, జంతువులకు దూరంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు సూచించాయి.

Back to Top