ఎల్ఐసీ పాలసీ ప్రియులకు చేదువార్త
- January 24, 2020లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) త్వరలో 23 పాలసీలను నిలిపేస్తోంది. ముఖ్యంగా బాగా పాపులర్ అయిన పాలసీలనే నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అందులో ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందిన జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీబ్యాక్, అన్మోల్ జీవన్.. ఇలా మొత్తం 23 పాలసీలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి ఈ పాలసీలన్నీ గతేడాది నవంబర్ 30వ తేదీనే నిలిచిపోవాల్సింది. అయితే ఐఆర్డీఏఐ గడువు పెంచడంతో.. ఈ జనవరి 31 వరకు ఈ 23 పాలసీలను కొనసాగిస్తోంది. అయితే వీటి స్థానంలో మళ్లీ కొత్త పాలసీలను తీసుకురానుంది. వాటిలో ఇప్పుడు ఉన్న ప్రీమీయిం రేట్ల కంటే ఎక్కువ కట్టాల్సి వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. బోనస్ కూడా తగ్గుతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త పాలసీ చేయాలనుకునే వారు.. ఈ వారం రోజుల్లో చేసుకుంటే.. ప్రస్తుతం ఉన్న లాభాలను పొందే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు