పెద్ద సంఖ్యలో ఇమిటేషన్ గూడ్స్ స్వాధీనం
- January 24, 2020
కువైట్: జనరల్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ - కస్టమ్స్ అధికారులు దేశంలోకి అక్రమంగా స్మగుల్ అవుతున్న వస్తువుల్ని అరికట్టడంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులు నార్త్ పోర్ట్‌లో పెద్దయెత్తున ఇమిటేషన్ గూడ్స్ స్మగుల్ అవుతుండగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. లోకల్ మార్కెట్‌కి వీటిని తరలించేందుకు ప్రయత్నం జరుగుతుండగా, వాటిని అధికారులు అడ్డుకున్నారు. ఇమిటేషన్ గూడ్స్‌ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేస్తారు. కాగా, షుయైబా పోర్ట్ వద్ద అధికారులు, ఓ కంటెయినర్‌పై అనుమానంతో స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తెరిచి చూడగా, పెద్దయెత్తున మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, బ్యాటరీలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాలూకు యాక్సెసరీస్ కనిపించాయి. వీటిని సంబంధిత శాఖలకు పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!