రెండోసారి కూడా కె-4 మిస్సైల్‌ సక్సెస్..

- January 24, 2020 , by Maagulf
రెండోసారి కూడా  కె-4 మిస్సైల్‌ సక్సెస్..

భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. కె-4 బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్ష విజయవంతమైంది. అందుకు మన విశాఖపట్నం తీరం వేదికైంది. 3500 కిలోమీటర్ల టార్గెట్స్‌ను ఈ క్షిపణి పూర్తిచేయగలదు. శుక్రవారం ఉదయం ఈ పరీక్ష జరిగింది. డీఆర్డీవో అభివృద్ది చేసిన ఈ మిస్సైల్‌ని.. టెస్ట్ చేయడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. అణ్వాయుధాలను తీసుకెళ్లి ప్రత్యర్థుల అంతు చూడగల సామర్థ్యం కె-4 మిస్సైల్‌ సొంతం. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలలో ఎక్కడినుంచైనా ఇది శత్రువులపై విరుచుకుపడగలదు. అరిహంత్ అణు జలాంతర్గాముల నుంచి ఎక్కుపెట్టేలా కె-4 క్షిపణులకు రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com