కువైట్‌:చెవిలో బగ్‌ డివైజెస్‌తో విద్యార్థుల ఛీటింగ్‌

- January 25, 2020 , by Maagulf
కువైట్‌:చెవిలో బగ్‌ డివైజెస్‌తో విద్యార్థుల ఛీటింగ్‌

కువైట్‌: విద్యార్థులు తమ చెవిలో బగ్‌ డివైజెస్‌ని పెట్టుకుని ఛీటింగ్‌కి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది విద్యార్థుల్ని గుర్తించి, వారికి సర్జరీ చేసి, వారి చెవిలోంచి ఇంప్లాంట్స్‌ని తొలగించారు. చెవిలో బగ్‌ డివైజ్‌కి సంబంధించి గత రెండేళ్ళలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కొందరు విద్యార్థులు పరీక్షలవగానే ఆ డివైజెస్‌ని సులువుగా తొలగించుకోగలుగుతున్నారనీ, మరికొందరు మాత్రం మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ సహాయం తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. చెవిలో ఈ తరహా డివైజెస్‌ కారణంగా ఒక్కోసారి ప్రాణాపాయం కూడా తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com