టర్కీ పార్లమెంట్ లో 'మ్యారీ యువర్ రేపిస్ట్' బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం

- January 25, 2020 , by Maagulf
టర్కీ పార్లమెంట్ లో 'మ్యారీ యువర్ రేపిస్ట్' బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం

ఇస్తాంబుల్:సమాజంలో మహిళలకు భద్రత లేకుండాపోతోంది. ఆడవాళ్లు రోడ్డు మీదకు ఒంటరిగా రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినతరమైన చట్టాలు తెచ్చినా నిత్యం ఎక్కడో ఒక చోటు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అత్యాచార నిందితులకు ఉరే సరైన శిక్ష అని దేశవ్యాప్తంగా ప్రజల నుంచి డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టర్కీ పార్లమెంట్‌లో ఓ వివాదాస్పదమైన బిల్లును ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.

తూర్పు దేశమైన టర్కీలో రేపిస్టులను శిక్ష నుంచి తప్పించేలా ఓ చట్టాన్ని రూపొందిస్తున్నారు. అదే 'మ్యారీ యువర్ రేపిస్ట్'. ఇక దీనికి సంబంధించిన బిల్లును ఈ నెలాఖరున పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. 18 ఏళ్ళ లోపు చిన్నారులపై లైంగిక దాడి లేదా అత్యాచారం చేసిన నిందితులకు ఇది వర్తిస్తుంది. వారు శిక్ష నుంచి మినహాయింపు పొందాలంటే.. అత్యాచార బాధితురాలిని తప్పనిసరిగా పెళ్లి చేసుకునేలా ఈ బిల్లును సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ బిల్లు టర్కీలో వివాదాస్పదం కావడమే కాకుండా.. మహిళా హక్కుల ప్రచారకర్తలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి వివాదాస్పద బిల్లే ఒకటి 2016లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. నాడు ఆ బిల్లుపై దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటడంతో ఆ బిల్లును ఉపసంహరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com