యూఏఈలో గ్రాండ్ గా ప్రారంభమైన ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

- January 25, 2020 , by Maagulf
యూఏఈలో గ్రాండ్ గా ప్రారంభమైన ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

దుబాయ్:దుబాయ్ లోని ఇండియన్ కాన్సూలేట్ లో 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.  జనవరి 26కి రెండు రోజుల ముందుగానే ప్రారంభమైన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ భారతీయ సంస్క్రతిని చాటేలా ప్రదర్శించిన కల్చరల్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మహాత్మగాంధీ 150వ జయంతి& 71st రిపబ్లిక్ డే అఫ్ ఇండియా పేరుతో నిర్వహించిన సెలబ్రేషన్స్ కలర్ ఫుల్ గా జరిగాయి. ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం దేశభక్తి భావంతో ఉప్పొంగిపోయింది. ఇండియన్ కాన్సులేట్ సహాకారంతో ఇన్సిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నిర్వహించింది. దాదాపు 300 మంది ప్రవాసీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు గంటల పాటు జరిగిన సాంస్క్రుతిక కార్యక్రమాల్లో స్కూల్ స్టూడెంట్స్ ప్రదర్శించిన స్కిట్లు, క్లాసికల్ డ్యాన్సులు, మహాత్మగాంధీతో పాటు ఇతర ఫ్రీడం ఫైటర్ ల జీవిత గాధలు, పాటలు అందరిని అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హజరైన ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ను ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ICAI దుబాయ్ టీంను కాన్సుల్ జనరల్ విపుల్ ప్రశంసించారు. కలర్ ఫుల్, వండర్ ఫుల్ ప్రదర్శనలతో ఆకట్టుకున్న స్టూడెంట్స్ ను అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com